calender_icon.png 14 November, 2024 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. తీర్పు రిజర్వ్

12-11-2024 05:30:46 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసుపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ ముగిసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్ పై వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సింగిల్ బెంచ్ తీర్పును అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్ పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదన్నారు. దీంతో కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్ కు విచారణ అర్హత లేదని తెలిపింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే హైకోర్టు జోక్యం తగదంటూ అప్పీల్ దాఖలు చేశారు. దీంతో అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్ పై ఇరు వైపులా వాదనాలు విన్న సీజే ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.