13-04-2025 12:06:34 PM
ఖార్టూమ్: పశ్చిమ సూడాన్‌లోని నార్త్ డార్ఫర్ రాష్ట్ర రాజధాని(Capital of North Darfur State) ఎల్ ఫాషర్‌లో పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(Paramilitary Rapid Support Forces) దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 144 మంది పౌరులు మరణించారని స్థానిక అధికారి ఒకరు ప్రకటించారు. జామ్జామ్ ప్రాంతంలో పౌరుల శిబిరాలపై రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ జరిపిన క్రూరమైన దాడి దాడుల్లో 100 మంది మృతి చెందారు. డజన్ల కొద్దీ మంది గాయపడ్డారు" అని నార్త్ డార్ఫర్ రాష్ట్ర ఆరోగ్య అధికారి డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం ఖాతిర్(Director General Ibrahim Khatir) మీడియాతో అన్నారు. అబూషాక్ శిబిరంపై జరిపిన మరో దాడిలో 14 మంది పౌరులు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నారు.
జామ్జామ్ శిబిరంలో మరణించిన వారిలో తొమ్మిది మంది శిబిరంలో ఫీల్డ్ హాస్పిటల్ నిర్వహిస్తున్న ప్రభుత్వేతర సంస్థ రిలీఫ్ ఇంటర్నేషనల్ ఉద్యోగులు ఉన్నారని ఖాతిర్ వెల్లడించారని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. అబూ షౌక్ శిబిరంపై ఆర్‌ఎస్‌ఎఫ్ జరిపిన భారీ షెల్లింగ్ ఫలితంగా శనివారం 40 మంది పౌరులు మరణించారని, వందలాది మంది గాయపడ్డారని స్వచ్ఛంద సేవకుల బృందం ఎమర్జెన్సీ రూమ్ ఒక ప్రకటనలో తెలిపింది. దాడులకు సంబంధించి ఆర్‌ఎస్‌ఎఫ్ ఇంకా స్పందించలేదు. మే 10, 2024 నుండి, ఎల్ ఫాషర్‌లో సుడానీస్ సాయుధ దళాలు (Sudanese Armed Forces), ఆర్‌ఎస్‌ఎఫ్ మధ్య భీకర పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమితి ఉదహరించిన సంక్షోభ పర్యవేక్షణ సమూహం అయిన ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా ప్రకారం, 2023 ఏప్రిల్ మధ్యకాలం నుండి సూడాన్ ఎస్ఏఎఫ్, ఆర్ఎస్ఎఫ్ మధ్య వినాశకరమైన సంఘర్షణలో 29,600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.