calender_icon.png 27 November, 2024 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేవాడ్ రాజవంశంలో అంతర్యుద్ధం

27-11-2024 02:50:50 AM

  1. పట్టాభిషేకం వేళ  మహారాజుకు పరాభావం
  2. కోటలోకి రానివ్వకుండా అడ్డుకున్న దాయాదులు
  3. ఉదయ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తత

ఉదయ్‌పూర్, నవంబర్ 26: మేవాడ్ రాజ్యవంశంలో కొత్త మహారాజు పట్టాభిషే కం వేళ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలె స్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. మహారాణా ప్రతాప్ సింగ్‌కు వారసులైన మహేంద్రసింగ్ మేవాడ్, అరవింద్ సింగ్ మేవాడ్ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో మేవాడ్ రాజ్య 76 మహారాజుగా ఉన్న మహేంద్రసిం గ్ ఇటీవల చనిపోయారు.

దీంతో ఆయన కొడుకు బీజేపీ ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ మేవాడ్‌కు 77వ కొత్త మహారాజుగా చిత్తోడ్‌గడ్‌లో సోమవారం పట్టాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం తమ కులదైవమైన ఏకలింగనాథ ఆలయాన్ని, ఉదయ్‌పూ ర్ సిటీ ప్యాలెస్‌ను కొత్త మహారాజు సందర్శించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే రాజకుటుంబానికి చెందిన ట్రస్ట్‌కు అరవింద్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా కొనసాగతున్నారు.

దీంతో ఆయన ఆధీనంలోనే ఏకలింగనాథ్ ఆలయం, ప్యాలెస్ ఉన్నాయి. ఈ క్రమంలో మహారాజుగా విశ్వరాజ్ సింగ్ పట్టాభిషేకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనను కోటలోకి రానివ్వబోమంటూ అరవింద్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే సోమవారం రాత్రి కొత్త మహారాజు విశ్వరాజ్ సింగ్ తన అనుచరులతో కలిసి కోట వద్దకు వెళ్లారు.

కానీ వారిని అరవింద్ కుమారుడు, ఆయన అనచరులు కోటలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో లోపలికి వెళ్లడానికి విశ్వరాజ్ అనుచరులు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిం ది. పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో కొందరు గాయపడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు వారిని చెదరగొట్టి  అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.