- పాలమూరు కాంగ్రెస్‌లో చర్చలు
- పదవుల కోసం పెద్దల ప్రసన్నం
- అధిష్టానంపై ఎవరి ధీమా వారిదే..
మహబూబ్‌నగర్, ఆగస్టు 6 (విజయక్రాంతి): నామినేటెడ్ పోస్టుల కోసం ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్‌లో తీవ్ర చర్చలు సాగుతున్నాయి. పదవుల కోసం పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్న ద్వితీయ శ్రేణి నాయకుల్లో అంతర్యుద్ధం మొదలైనట్లుగా కనిపి స్తున్నది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ద్వితీ య శ్రేణి నేతలే ఏ పార్టీకైనా చాలా కీలకం. అలాంటి కీలకమైన నేతలకు నామినేటెడ్ పోస్టులను ఖాయం చేసే సమయం ఆసన్నమైంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి మహ బూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి వచ్చిన సమయంలో పార్టీ కోసం శ్రమించిన నాయ కులకు, కార్యకర్తలకు సముచిత గౌరవం అం దేలా చూస్తామని చెప్పారు.
అందుకు ఎమ్మెల్యేలే బాధ్యత వహించాలన్నారు. దీంతో నామినేటెడ్ పోస్టుల చర్చ మరింత తీవ్రత రం అయింది. జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టులకు జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల నుంచి ఒక్కరు లేదా ఇద్దరికీ అవకాశం కల్పించేలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మాత్రం పదుల సంఖ్యలో ఆశావహులు ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లోని ఆశావహులు ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
మాకు పదవి ఖాయం..
కాంగ్రెస్‌లోని పాత, కొత్త లీడర్లు పదవులపై ధీమాతో ఉన్నారు. పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నందున తమకే పదవి దక్కుతుందని పాతవారు భావిస్తుండగా... పదవి ఇస్తామని భరోసా ఇవ్వడంతోనే కాం గ్రెస్‌లో చేరామని బీజేపీ, బీఆర్‌ఎస్‌ల నుంచి వచ్చిన నేతలు అంటున్నారు. దీంతో ఎవరిని నిరాశపరిచినా ద్వితీయ శ్రేణి నాయకుల్లో అంతర్యుద్ధం ఖాయమని భావిస్తున్న కాం గ్రెస్ పెద్దలు, ఎమ్మెల్యేలు.. అందరినీ సంతృ ప్తి పరిచే పనిలోపడినట్లు తెలుస్తున్నది.
అధిష్టానంపై నేతల ఒత్తిడి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ ఎన్నికలు రావడం, ఆ తర్వాత మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు.. తాజాగా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఇంతకాలం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేదు. ఆశావహులు కూడా ఇప్పటి వరకు నిరీక్షించారు. అసెంబ్లీ సమావేశాలతోపాటు బడ్జెట్ ప్రక్రి య పూర్తి కావడంతో నామినేటేడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధిష్టానంపై నాయకులు ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ఈ నెల చివరిలోగా నామినేటేడ్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అసంతృప్తులు లేకుండా ముందస్తు చర్యలు
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కొందరు బీఆర్‌ఎస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేశారని ప్రచారం జరిగింది. ఎంపీ ఎన్నికల సమయంలో వారు కూడా కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం కాంగ్రెస్ గెలవలేకపోయినా పార్టీలోకి వచ్చిన నేతలు మాత్రం నామినేటేడ్ పోస్టులను అశిస్తున్నారు. పార్టీలో ఉన్న పాతవారైనా, కొత్తగా చేరిన ఎవరైనా అధిష్టానానికి సమానమేనని, అందరికీ సమాన న్యాయం చేస్తామని ఎమ్మెల్యేలు చెప్పినట్లుగా తెలుస్తున్నది.
దీంతో ముం దు నుంచి ఉన్న కాంగ్రెస్ క్యాడర్ సైతం ఇప్ప టి వరకు నోరు మెదపలేదు. కానీ పదవులు రాకపోతే తిరుగుబాటు తప్పదని తెలుస్తున్నది. దీంతో ముందస్తుగానే చర్చ లు జరిపి, నామినేటేడ్ పోస్టులను కేటాయించే పనిలో ఎమ్మెల్యేలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.