calender_icon.png 1 April, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని రైస్ మిల్లులో సివిల్‌ సప్లె ఎన్‌ఫోర్స్​‍మెంట్‌ అధికారుల ఆకస్మిక మేరుపు దాడులు

29-03-2025 01:29:02 AM

మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలోని రైస్ మిల్లులో సివిల్‌ సప్లె ఎన్‌పోర్స్​‍ మెంట్‌ అధికారులు శుక్రవారం కస్మిక మెరుపు దాడులు నిర్వహించారు. తెలంగాణ సివిల్‌ సప్లె కమీషన్‌ ఆదేశాల మేరకు సివిల్‌ సప్లె ఎన్‌ఫోర్స్​‍మెంట్‌ అధికారులు, ఎఫ్‌సీఐ అధికారులు  మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మి మోడ్రన్‌ పారాబాయిల్డ్​‍ రైస్ అండ్‌ మిల్లులో ఏక కాలంలో తనిఖీలు నిర్వహించారు. సివిల్‌ సప్లెకి సంబంధించిన 2022-23 సంవత్సరానికి సంబంధించిన ధాన్యం నిల్వలపై, ఎఫ్‌సీఐకి సంబంధించి 2023-24 సంవత్సరానికి సంబంధించి ధాన్యం, బియ్యం నిల్వలపై అధికారులు తనిఖీ చేశారు.

మొదటగా సూరయ్యపల్లిలోని శ్రీ లక్ష్మి మోడ్రన్‌ పారాబాయిల్డ్​‍ రైస్ అండ్‌ మిల్లులో తనిఖీ చేయడంలో మిల్లులో నిలువ ఉన్న ఎఫ్‌సీఐకి సంబంధించిన బియ్యం, ధాన్యం నిల్వలను తనిఖీ చేశారు. ఆనంతరం గంగాపురిలోని సత్యసాయి రైస్ లో నిలువ ఉంచిన స్టాక్‌ను పరిశీలించారు. ఈ తనిల్లో 41,365.27 క్వింటాళ్ల ధాన్యంకు గాను 9689.8 కింటాళ్లు మాత్రమే లెక్కలోకి వచ్చాయి. మిగతా 31675.47క్వింటాళ్ల ధాన్యం స్వాహా అయినట్లు అధికారులు గుర్తించారు. అదే విధంగా  ఎఫ్‌సీఐకి సంబంధించి 2023-24 రబీ సీజన్‌కు సంబంధించి 19,339 క్వింటాళ్లు మొత్తం ధాన్యం, బియ్యం నిలువ ఉన్నట్లు గుర్తించారు. కాగా తనిఖీలు నిర్వహిస్తున్న మిల్లు యజమాని సత్యనారాయణ అధికారులతో పలుసార్లు వాగ్వాదానికి దిగారు. ఈ దాడిలో సివిల్‌ సప్లె టాస్క్ ఫోర్స్​‍ ఓఎస్డీ ప్రభాకర్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ లకేష్మారెడ్డి, సివిల్‌ సప్లె ఎన్‌ఫోర్స్​‍మెంట్‌ ఎస్ఐ జంగయ్య, సివిల్‌ సప్లై పెద్దపల్లి డీటీ సంతోష్‌సింగ్‌, సివిల్‌ సప్లె ఇన్స్​‍పెక్టర్‌ శ్రీనివాస్ పాల్గొన్నారు.