నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఖరీఫ్ లో వరి సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు 24 గంటల్లోనే దానిని డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్ అన్నారు. బుధవారం కిరణ్ మాట్లాడుతూ... జిల్లాలో 284 వరదన్న కొనుగోలు కేంద్రాల్లో ఒక్క లక్ష 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేయడం జరిగిందన్నారు. 24,864 మంది రైతులకు ఇప్పటివరకు 258 కోట్లను వారి ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం సన్న రకం వరి ధాన్యం పండించే రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించగా 60 కోట్ల బోనస్ ను పంపిణీ చేయడం జరిగిందని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ సహకారంతో నిర్మల్ జిల్లాలో వరిధాన్యం కొనుగోలు 90 శాతం పూర్తి చేయడం జరిగిందని మిగతా 10 శాతం వారం రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.