12-02-2025 02:44:59 PM
రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ
రేషన్ కార్టుల దరఖాస్తులపై స్పష్టతిచ్చిన పౌరసరఫరాల శాఖ
హైదరాబాద్: రేషన్ కార్డులకు దరఖాస్తులపై తెలంగాణ పౌరసరఫరాలశాఖ(Telangana Civil Supplies Department) స్పష్టత ఇచ్చింది. రేషన్ కార్డులకు దరఖాస్తుల(Application for Ration Cards) స్వీకరణ నిరంతర ప్రక్రియని తెలిపింది. దరఖాస్తుల సమర్పణకు నిర్దేశిత గడువు ఏమీ లేదని వెల్లడించింది. దరఖాస్తుదారులు తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పింది. ప్రజావాణిలో దరఖాస్తు(Prajavani Application) చేసిన వారు మళ్లీ చేయొద్దని పౌరసరఫరాలశాఖ సూచించింది. మీసేవ కేంద్రాల్లో(Meeseva Centers) దరఖాస్తుల స్వీకరణ నిరంతరం ఉంటుందని వివరించింది. కులగణన, ప్రజాపాలనలో దరఖాస్తు చేస్తే మళ్లీ అవసరం లేదని ప్రకటించింది. మీసేవలో దరఖాస్తు చేసిన రసీదును దాచిపెట్టుకోవాలని తెలిపింది. దరఖాస్తు రసీదును ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది.