ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చీఫ్ మెంటర్ భవానీశంకర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (విజయక్రాంతి): విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగితే మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో విజయం సాధించడం సాధ్యమని ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చీఫ్ మెంటర్ భవానీ శంకర్ పేర్కొన్నారు. శనివారం ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ట్వంటీ ఫస్ట్ సెంచరీ, వింగ్స్ మీడి యా, జీ5 మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
సివిల్ సర్వీసెస్ పరీక్ష కష్టమేమీ కాదని, క్రమపద్ధతితో ప్రణాళిక వేసు కుని చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని చెప్పారు. గతంలో వచ్చిన ప్రశ్నల ఆధారంగా సులభంగా పరీక్ష అర్థమవుతుందన్నారు.
ఈ సందర్భంగా ట్వంటీ ఫస్ట్ సెంచ రీ ఐఏఎస్ అకాడమీ రూపొందించిన పుస్తకాలను ఆవిష్కరించి, లైబ్రరీకి అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బ్రదర్ అరుణ్‌ప్రకాశ్, వైస్ ప్రిన్సిపాల్ సాధన శ్రీవత్సవ్, అధ్యాపకులు వరుణ్, వాసవి, వేణుగోపాల్, దీపిక, వింగ్స్ మీడియా ప్రతినిధులు గిరిప్రకాశ్, గణేశ్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.