calender_icon.png 30 November, 2024 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశసేవకు సివిల్స్ చక్కటి మార్గం

30-11-2024 02:54:50 AM

21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణప్రదీప్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 29 (విజయక్రాంతి): దేశానికి సేవ చేయడానికి సివిల్స్ సర్వీస్ చక్కటి మార్గమని 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పీ కృష్ణ ప్రదీప్ అన్నారు. 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ, వింగ్స్ మీడియా, జీ5 మీడియా సంయుక్త ఆధ్వర్యంలో కీసరలోని గీతాంజలి ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ‘మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ సాధించడం ఎలా’ అనే అంశంపై శుక్రవారం సెమినార్ జరిగింది.

ఈ సెమినార్‌లో పాల్గొ న్న పీ కృష్ణప్రదీప్ మాట్లాడుతూ.. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో 60 గ్రామాల రైతులు ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనను ప్రస్తావిస్తూ జానకీ షర్మిల అనే ఐఏఎస్ అధికారిణి సివిల్ సర్వీసెస్ ద్వారా తనకొచ్చిన అధికారం, నిర్ణయాలతో ఈ సమస్యను ఎలా పరిష్కరించారో వివరించారు. జానకీ షర్మిల 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ పూర్వ విద్యార్థిని అని చెప్పుకోవడం గర్వంగా ఉందన్నారు.

ఈ సంద ర్భంగా యూపీఎస్‌సీ పరీక్షలో అడిగే వివిధ ప్రశ్నలను పీపీటీ ద్వారా చీఫ్ మెంటర్ భవానీ శంకర్ విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో సివిల్ ఆస్పిరెంట్స్ క్లబ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. డాక్టర్ ప్రసన్న కుమా ర్, కళాశాల చైర్మన్ చైర్మన్ జి. రవీందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఉదయ్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నవీన్ రామ్, మంజుల, జీ5 మీడియా, వింగ్స్ మీడియా డైరెక్టర్లు గిరి, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.