చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండల పరిదిలోని పోలంపల్లి గ్రామంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, ఎస్సీ హాస్టల్ వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ కార్యక్రమం పొలంపల్లి ఎస్సీ కాలనీలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ... ఎస్సీ కులస్తులను ఎవరైనా కులం పేరుతో దూషించిన, గుడిలో రాకుండా అడ్డుపడిన, వారి పైన, ఎస్సీ ఎస్టీ అప్రొసిట్ కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందన్నారు. గ్రామంలో ఎవరైనా కులాంతర వివాహం చేసుకున్నట్లయితే వారికి ప్రభుత్వం తరుపున 50,000 వేల రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుందని అన్నారు, ఈ కార్యక్రమం లో చేగుంట ఎస్సీ హాస్టల్ వార్డెన్ కొత్తపల్లి రమేష్, పొలంపల్లి గ్రామ సెక్రెటరీ స్రవంతి, చేగుంట హెడ్ కానిస్టేబుల్, జి సత్తయ్య, వివిధ శాఖల మండల్ అధికారులు, గ్రామస్తులు కొండి మల్లేశం, టప్ప భాను, డిస్ రాజు, యాదగిరి, కిషన్ రమేష్, దుర్గయ్య, బాల్ నర్సింలు, కిషన్ పద్మయ్య, నాగరాజు, టి కిష్టయ్య వై శివ, బాలకృష్ణ, సురేష్, ప్రశాంత్, చందు, ఎస్ స్వామి, మహిళలు,, తదితరులు పాల్గొన్నారు,