calender_icon.png 10 January, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులవివక్ష నిర్మూలించేందుకు పౌర హక్కుల దినోత్సవం

30-12-2024 04:26:17 PM

మండల తహసిల్దార్ సతీష్ కుమార్...

మందమర్రి (విజయక్రాంతి): గ్రామాల్లో ప్రజల మధ్య వైశామ్యాలు తొలగించి ప్రజలందరు సమానమే అని చాటి చెప్పుతూ కుల వివక్షను సమూలంగా నిర్మూలించేందుకే పౌర హక్కుల దినోత్సవం లక్ష్మణ్ మండల తహసిల్దార్ సతీష్ కుమార్ అన్నారు. మండలంలోని అందుగులపేట గ్రామంలో సోమవారం నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో స్వేచ్చ, సమానత్వంతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి నెల గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ప్రజలు కుల వివక్ష తదితర అంశాలపై ఇబ్బందులకు గురైతే బాదితులు నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ పద్మజ, మండల వసతి గృహ సంక్షేమాదికారి ఎ కిషోర్ కుమార్, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జిల్లపెల్లి వెంకటేష్, ఎన్జీఓ మాధవన్ గ్రామస్థులు పాల్గొన్నారు.