ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
కామారెడ్డి, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): కామారెడ్డి జిలాల్లోని అన్ని గ్రామా ల్లో ప్రతి నెల సివిల్ రైట్స్ డే నిర్వహించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. మంగళవారం ఐడీ వోసీలోని సమావేశ మందిరంలో కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులతో సమీక్ష సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. ప్రజలకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగహన కల్పించాలన్నారు.
జరిగిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు లు, భూ సంబంధ కేసులు, సర్వీస్ మోటర్స్‌లకు సంబంధించిన కేసులపై ఈ నెలాఖరు లోగా నివేదికలు సమర్పించాలని తెలిపారు. గురుకులాలను అధికారులు పర్యవేక్షించాల ని చెప్పారు. జిల్లాలో అంబేద్కర్ భవన ని ర్మాణం కోసం చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు సూచించారు. అట్రాసిటీ కేసుల్లో బాధితుల కు నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సమావేశంలో ఎస్పీ సింధుశర్మ, కమిషన్ సభ్యులు నీలాబాయి పాల్గొన్నారు.