calender_icon.png 12 March, 2025 | 7:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతినెలా సివిల్ రైట్స్ డే నిర్వహించాలి

12-03-2025 01:43:34 AM

రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య 

నల్లగొండ, మార్చి 11 (విజయక్రాంతి) : షెడ్యూల్డ్ కులాలు, తెగలపై దాడుల నివారణ, అంటరానితనంపై గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు ప్రతినెలా సివిల్ రైట్స్ డేను నిర్వహించాలని, మూడు నెలలకోసారి జిల్లాస్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ర్ట ఎస్సీ ,ఎస్టీ కమిషన్ చైర్మన్  బక్కి వెంకటయ్య జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్లో ఎస్సీ, ఎస్టీలపై దాడుల కేసులు, భూముల సమస్యలపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధ్యక్షతన కమిషన్ సభ్యులు సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై ఆయా సంఘాల ప్రతినిధులు నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

అనంతరం చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీల భూములకు సంబంధించి (9)  కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, మార్చి 31 లోగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్  ఇలా త్రిపాఠిని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులపై 17 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వీటిపై నివేదిక ఇవ్వాలని ఎస్పీని కోరారు. స్పందించిన ఆయన 12 కేసుల్లో ఇప్పటికే పంపించామని, ఐదు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 37 కేసుల్లో చార్జిషీటు దాఖలు చేయలేదని సకాలంలో వేయకపోతే లబ్ధిదారులు నష్టపోతారని చెప్పారు.

  ప్రణయ్ హత్య కేసులో వాదనలను వినిపించి నిందితులకు శిక్షపడేలా చేసిన న్యాయవాది దర్శనం నర్సింహను సన్మానించారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు కుస్రం నీలాదేవి, ఇన్‌చార్జి డీఆర్వో అశోక్ రెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, దేవరకొండ ఏఎస్పీ మౌనిక, ఆర్డీఓలు, డిఎస్పీలు, జిల్లా అధికారులు , ఎస్సీ, ఎస్టీ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్ సంబంధించిన అఖిల హాజరయ్యారు.