26-04-2025 12:00:00 AM
90కి పైగా ఆల్ ఇండియా ర్యాంకులు
వెల్లడించిన డైరెక్టర్ శ్రీకాంత్ విన్నకోట
ముషీరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాలలో అనలాగ్ ఐఏఎస్ కోచింగ్ అకాడమీ 90 పైగా ఆల్ ఇండియా ర్యాంక్స్ సా ధించినట్లు అకాడమీ డైరెక్టర్ శ్రీకాంత్ విన్నకోట వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఇందిరా పార్క్ చౌరస్తాలోని అనలాగ్ ఐఏఎస్ అకాడమీలో ఆల్ ఇండియా 5వ ర్యాం క్ సాధించిన ఆకాష్ గార్గ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీ కాంత్ విన్నకోట మాట్లాడుతూ.. ఆల్ ఇం డియా 14వ ర్యాంక్ అభిషేక్ వశిష్ట, 21వ ర్యాంక్ దివ్యాంక్ గుప్తా, ఆల్ ఇండియా 31వ ర్యాంక్ శ్రేయ త్యాగి, 41వ ర్యాంక్ సచిన్ బసవరాజ్ గుంటూరు తోపాటు 90 మంది విద్యార్థులకు పైగా ఆల్ ఇండియా ర్యాం కులు రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు.
హైదరాబాద్ తో పాటు దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ర్యాంకులు సాధించిన ఐఏఎ స్ అకడమిగా నిలిచిందని పేర్కొన్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా రూ పొందించిన వ్యూహాలు మెయిన్స్ ,ప్రిలిమ్స్ కోసం రూపొందించిన సమగ్ర ప్రాక్టీస్ పద్ధతులు, ప్రతి అంశం కవర్ అయ్యే విధంగా సిద్ధం చేసిన స్టడీ మెటీరియల్స్, వ్యూహాలు, ప్రిలిమ్స్ మెయిన్స్ కోసం రూపొందించిన సమగ్ర ప్రాక్టీస్ పద్ధతులు , ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ మెంటర్షిప్ వంటి అంశాలు ఈ విజయానికి దోహదంచేసినట్లు ఆయన వెల్లడించారు.