calender_icon.png 23 September, 2024 | 6:54 PM

వృద్ధాశ్రమంలో వృద్ధులు, వికలాంగులతో ముచ్చటించిన సివిల్ జడ్జి

23-09-2024 04:56:01 PM

కరీంనగర్, (విజయక్రాంతి): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జ్  కే వెంకటేష్  ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ వృద్ధుల, వికలాంగుల ఆశ్రమము, స్వాదార్ హోమ్ ను సందర్శించారు. వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులు, వికలాంగులతో కలిసి ముచ్చటించారు. వృద్ధులకు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని  సూచించారు.

స్వాదార్ హోమ్ లో ఉన్న వారితో మాట్లాడుతూ... యవ్వనంలో ఆకర్షణకు లోనై దానిని ప్రేమగా భావించి కష్టపడి చదువిస్తున్న తల్లి తండ్రులను ఇబ్బందులకు గురిచేసి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. విద్యార్థి దశలో ఎటువంటి లైంగిక వేధింపులకు గురైన కూడా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా మిత్రులకు తెలియజేయాలని అలా తెలియజేయకుండా ఉంటే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.

ఆహార పదార్థాలను నిలువచేసే గదులను తనిఖీ చేశారు. ఆహార పదార్థాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఎలాంటి న్యాయపరమైన లేదా న్యాయ సేవ అవసరమైన సంప్రదించవలసిందిగా నిర్వాహకులను ఆదేశించారు. ఈ సందర్భంగా వృద్ధుల, వికలాంగుల ఆశ్రమంలో స్వాధార్ హోమ్ లో పండ్ల పంపిణీ చేశారు. ఇట్టి కార్యక్రమంలో లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్, వృద్ధాశ్రమము, స్వాధార్ హోం సిబ్బంది  పాల్గొన్నారు.