calender_icon.png 20 November, 2024 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సివిల్ సప్లుశైఖ నిర్ణయాలు సాహసోపేతం

20-11-2024 12:42:37 AM

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కట్టడికి రాష్ట్ర పౌర సరఫరాలశాఖ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నదని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో ప్రశంసించారు. అందుకు ఆ శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు.

పీడీఎస్ బియ్యం దారి మళ్లింపు దేశవ్యాప్తంగా అధ్యయనం చేయగా, ఒక్క తెలంగాణలో అతి తక్కువగా పక్క దారి పడు తున్నట్లు తేలిందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో సుమారు 2.8 కోట్ల మంది లబ్ధిదారులకు నెల నెలా పీడీఎస్ బియ్యం అందజేస్తున్నామన్నారు. అలాగే విద్యార్థుల మధ్యాహ్నం భోజన పథకం, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో కలిపి మొత్తం 49 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు.