calender_icon.png 11 January, 2025 | 1:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరాల వారీగా..

05-07-2024 02:18:04 AM

నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ ప్రకారం ఈ ఏడాది జనవరి మధ్యకాలంలో ముంబైలో హౌసింగ్ అమ్మకాలు 16 శాతం వృద్ధిచెంది 47,259 యూనిట్లకు పెరగ్గా, ఆఫీస్ లీజింగ్ 79 శాతం వృద్ధితో 5.8 మిలియన్ చదరపు అడుగులు నమోదయ్యింది. ఢిల్లీ ఎన్సీఆర్‌లో హౌసింగ్ విక్రయాలు 4 శాతం క్షీణించి 28,998 యూనిట్లకు తగ్గగా, ఆఫీస్ స్పేస్ డిమాండ్ మాత్రం 11.5 శాతం పెరిగి 5.7 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. బెంగళూరులో ఇండ్ల అమ్మకాలు 4 శాతం వృద్ధితో 27,404 యూనిట్లకు, ఆఫీస్ స్పేస్ లీజింగ్ 21 శాతం పెరిగి 8.4 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. పూణేలో హౌసింగ్ అమ్మకాలు 13 శాతం వృద్ధితో 24,525 యూనిట్లకు, ఆఫీస్ స్పేస్ డిమాండ్ 88 శాతం వృద్ధితో 4.4 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది.

చెన్నైలో రెసిడెన్షియల్ ఆస్తుల విక్రయాలు 12 శాతం వృద్ధితో 7,975 యూనిట్లకు పెరగ్గా, ఆఫీస్ స్పేస్ డిమాండ్ మాత్రం 33 శాతం క్షీణించి 3 మిలియన్ చదరపు అడుగులకు తగ్గింది. హైదరాబాద్‌లో హౌసింగ్ విక్రయాలు 21 శాతం వృద్ధిచెంది 18,573 యూనిట్లకు పెరగ్గా, ఆఫీస్ స్పేస్ డిమాండ్ 71 శాతం వృద్ధిచెంది 5 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. కోల్‌కతాలో గృహ అమ్మకాలు 25 శాతం వృద్ధితో 9,130 యూనిట్లకు చేరగా, ఆఫీస్ స్పేస్ లీజింగ్ 23 శాతం పెరిగి 0.7 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. అహ్మదాబాద్‌లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ విక్రయాలు 17 శాతం వృద్ధిచెంది 9,377 యూనిట్లకు చేరగా, ఆఫీస్ స్పేస్ లీజింగ్ పలు రెట్లు పెరిగి 1.7 మిలియన్ చదరపు అడుగులకు చేరింది.