calender_icon.png 16 March, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌ఆర్‌హెచ్‌తో సీయూబీ ఒప్పందం

16-03-2025 01:25:08 AM

అభిమానులకు ప్రత్యేక ఆఫర్లు

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాం తి): ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో తనదైన ముద్రతో దూసుకెళ్తున్న సిటీ యూనియన్ బ్యాంక్ (సీయూబీ).. వినియోగదారులకు మరింత చేరువయ్యే క్రమంలో ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఆ బ్యాంక్ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ భాగస్వామ్యంతో ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులతో పాటు క్రికెట్ ఔత్సాహికులతో కనెక్టివిటీ పెరుగుతుందని వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా ఎస్‌ఆర్‌హెచ్ టీమ్ అభిమానులకు సిటీ యూని యన్ బ్యాంక్ సులభమైన బ్యాంకింగ్ సేవలు అందించనుంది. పొదుపు ఖాతాలు, రుణాలు, బ్రాండెడ్ కార్డులతో పాటు అనేక రకాల ప్రత్యేక బ్యాంకింగ్ సేవలు అందిస్తుం ది. ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు సంబంధించిన జెర్సీలు, క్యాప్‌లు ఇతర వస్తువుల విక్రయాలకు సంబంధించి ఫ్యాన్స్ కోసం ప్రత్యేక ఆఫర్లు ఇవ్వనుంది.