calender_icon.png 1 November, 2024 | 1:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు

30-08-2024 02:19:35 PM

సిద్దిపేట (విజయ క్రాంతి): సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆగష్టు 31 ఉదయం 6 గంటల నుండి సెప్టెంబర్ 15 ఉదయం 6 గంటల వరకు సిటీ పోలీస్ యాక్ట్  ఆమలులో వుంటుందని సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వం అనుమతులు లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, వ్యాపార దుకాణాల బందు, శాంతి భద్రతలకు విగాథం కలిగించే విధంగా  సభలు, సమావేశాలు నిర్వహించకూడదని పేర్కొన్నారు.

డిజె సౌండ్ వినియోగం నిషేధించినట్లు వెల్లడించారు. డిజె సౌండ్ వినియోగించడం వల్ల చిన్నపిల్లలకు, వృద్ధులకు, వివిధ రకాల దీర్ఘకాలిక రోగులకు ఇబ్బంది కలగడంతో పాటు విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలుగుతుందన్నారు. మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసిపి అధికారుల అనుమతి పొందాలని సూచించారు. పై నిబంధనలు ఉల్లంఘించి డీజే వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతామని హెచ్చరించారు.