calender_icon.png 23 November, 2024 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాపంగా మారుతున్న నగర జీవితాలు

23-11-2024 12:30:47 AM

ఢిల్లీ, ముంబై వంటి మహానగరాలు వాతావరణ కాలుష్యపు కుంపట్లవలె మారాయి. ఊపిరి సల్పరాని గాలి కాలుష్యాలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతూ బతుకులు ఈడుస్తున్నారు. శీతా కాలం వస్తుందంటేనే భయమేస్తోంది. చలిలో కాలుష్యం జడలు విప్పుకుంటున్న దృశ్యాలు భయానకం. నగరాల సమీప వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు పెద్ద ఎత్తున వ్యర్థాలను కాల్చడం వల్ల కాలుష్యం మరింత తీవ్రరూపం దాలుస్తున్నది. గర్భిణి స్త్రీలలో బిడ్డ ఎదుగుదలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతున్నట్టు నిపుణులు చెబుతు న్నారు.

మిస్‌క్యారేజ్ లేదా అబార్షన్ సహా నెలలు నిండాకుండానే ప్రసవాలు, తక్కువ బరువు శిశువులు పుట్టడం, ప్రసవానంతరం తల్లీబిడ్డలకు అనారోగ్యాలు.. వంటివి తలెత్తుతున్నట్టు తెలుస్తున్నది. మహిళా కార్మికులపైనా గాలి కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉంటున్నది. మహిళా సఫాయి కార్మికులపై కాలుష్య ప్రభావం ఆరు రెట్లు అధికంగా నమోదవుతున్నది. మహానగరాల రేపటి పౌరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. 

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి, కరీంనగర్