calender_icon.png 10 January, 2025 | 10:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు సిటీ బస్సులు

10-01-2025 01:39:35 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో ఇటీవల ప్రారంభమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పలు ప్రాంతాల నుంచి టీజీఎస్ ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్టు చెంగిచర్ల డిపో మేనేజర్ తెలిపారు.

ఈ మేరకు సికింద్రాబాద్ బ్లూ సీ హోటల్ నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు రెగ్యులర్ పద్ధతిలో తెల్లవారుజామున 4.30 నుంచి రాత్రి రూ. 10.30 గంటల వరకు ప్రతీ 10 నిమిషాలకు ఒకసారి సికింద్రాబాద్, హబ్సీ గూడ, నాచారం, మల్లాపూర్ మీదుగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఫ్లాట్ ఫామ్ 1 వరకూ సర్వీస్ ఉంటుందన్నారు.

చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఫ్లాట్‌ఫామ్ 9 నుంచి చెంగిచర్ల, ఉప్పల్, రామాంతాపూర్ మీదుగా బోరబండకు ప్రతి 40 నిమిషాలకు ఒక సర్వీస్ ఉంటుందన్నా రు. ప్రస్తుతం సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు నడుస్తున్నందున ఉప్పల్ క్రాస్‌రోడ్ నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఫ్లాట్‌ఫామ్ 9 వరకు బస్సు సర్వీసులు ఉం టాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.