calender_icon.png 22 April, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మే 20న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి: సీఐటీయు

21-04-2025 10:22:51 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): సీఐటీయు ఇల్లందు మండల సమన్వయ కమిటీ సమావేశం సుల్తానా అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో సిఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి, మండల కన్వినర్ తాళ్లూరి కృష్ణలు పాల్గొని మాట్లాడుతూ... కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ కార్మికులకు, కర్షకులు, ప్రజలకు వ్యతిరేకంగా కార్పోరేట్ శక్తులకు ఆకులంగా పనిచేస్తున్నారని దానికి వ్యతిరేకంగా మే 20 న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో కల్లేపల్లి మరియా, షేక్ ఫాతిమా, కటకం రాజయ్య, బోయిన పద్మ, బానోత్ భద్రు, పవన్ పాసి, హుస్సేన్, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.