calender_icon.png 19 January, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ రంగం కార్మికుల సేవలు వెలకట్టలేనివి..!

19-01-2025 07:18:07 PM

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా...

భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు

భద్రాచలం,(విజయక్రాంతి): విద్యుత్ రంగ కార్మికులు(Electricity Sector Workers) రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రగతికి అందిస్తున్న సేవలకు వెలకట్టలేమని వారి సేవలను ఎంత కొనియాడినా తక్కువేనని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. ఆదివారం తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్(Telangana State United Electricity Employees Union), సిఐటియు రాష్ట్ర కమిటీ ముద్రించిన 2025 డైరీ వాల్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కే ఈశ్వరరావు అధ్యక్ష వహించగా ఎమ్మెల్యే వెంకటరావు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకం అమలులో విద్యుత్ రంగం కార్మికుల యొక్క శ్రమ కీలకమైందని గుర్తు చేశారు విద్యుత్తు ఉత్పత్తి పంపిణీ సక్రమంగా ఉంటేనే రాష్ట్ర ప్రగతి సక్రమంగా ఉంటుందని పేర్కొన్నారు. వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ప్రజలకు ఎటువంటి ఆటంకం లేకుండా 24 గంటలు సేవలందిస్తున్న విద్యుత్ రంగా కార్మికులు నిజమైన ప్రజా సేవకులను స్పష్టం చేశారు.

రాష్ట్రంలో విద్యుత్ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆర్టిజన్లను కన్వర్షన్ చేయటం అన్యాన్ కార్మికులకు బిల్ కలెక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించడం ఈపీఎఫ్ నుండి జిపిఎఫ్ లోకి విద్యుత్తు రంగ ఉద్యోగులను కార్మికులను మార్పు చేయటం వంటి కీలకమైన సమస్యలపై కార్మికుల తరఫున కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. పోరాటాల చరిత్ర గలిగిన సిఐటియు సంఘంలో హక్కుల కోసం మీరు నిర్వహించే పోరాటాలన్నీ విజయవంతం కావాలని ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ స్వామి రాష్ట్ర గౌరవాధ్యక్షులు వి కుమారాచారి వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ జాయింట్ సెక్రెటరీ బొల్లి వెంకటరాజు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ  చంద్రారెడ్డి వెంకటనారాయణ ఉపాధ్యక్షులు ఎం ప్రసాద్ కే మధు సుధాకర్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు స్వప్న వెంకటేశ్వరరావు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు