22-02-2025 12:00:00 AM
మందమర్రి, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి) : సింగరేణి కార్మిక వర్గ ప్రయోజనాలు పరిరక్షణ కోసం హక్కుల సాధన కోసం రాజీలేని పోరాటాల నిర్వహిస్తూ ఏరియాలో సిఐటియు బలమైన కార్మిక సంఘంగా అవతరిస్తుందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు) బ్రాం అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి స్పష్టం చేశారు.
ఏరియాలోని కాసిపేట1 గనిపై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన కార్మికుల నుద్దేశించి మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా సిఐటియు ఆద్వర్యంలో సొంతింటి కలపై చేస్తున్న పోరాటంతో పాటు ఏరియాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ప్రధాన ప్రతిపక్ష యూనియన్‌గా సిఐటియు చేపడుతున్న ఆందోళనలను గమనిస్తున్న కార్మికులు పోరాటంలో స్వచ్ఛందం గా భాగస్వామ్యం అవుతామని ముందుకు వస్తున్నారని అన్నారు.
ఈ సందర్బంగా కాసిపేట 1 గనికి చెందిన అమీర్, నవీన్ యూనియన్‌లో చేరగా వారికి ఆయన కండువాలు కప్పి ఆహ్వా నించారు. కార్యక్రమంలో పిట్ సెక్రటరీ దెబ్బటి తిరుపతి, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ నాగవెల్లి శ్రీధర్, కందుగుల రమేష్, ఏరియా సీనియర్ నాయకులు అలవాల సంజీవ్ పాల్గొన్నారు.