calender_icon.png 16 March, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణిలో బలపడుతున్న సిఐటియు

15-03-2025 10:47:41 PM

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్( సిఐటియు) కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రాజీలేని పోరాటాలతో కార్మికులు యూనియన్ ను ఆదరించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి యూనియన్ లో చేరుతున్నారని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు సాంబారు వెంకటస్వామి, అల్లి రాజేందర్ లు ఆన్నారు. ఏరియాలోని కేకే 5 గనిపై నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సొంతింటి కళ సాకారంతో పాటు ఇతర కార్మికుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న ఆందోళనలు, పోరాటాలతో కార్మికులు పెద్ద ఎత్తున యూనియన్ లో చేరుతున్నారని ఆన్నారు.

ముఖ్యంగా అన్నిగనుల్లో యువ కార్మికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి యూనియన్ చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలకు ఆకర్షితులై యూనియన్ లో చేరుతున్నారని కార్మికుల చేరికతో యూనియన్ బలోపేతం అవడమే కాకుండా కార్మికుల హక్కులు డిమాండ్ల సాధన కోసం పోరాటాలు ఆందోళనలు నిర్వహించే గురు తర బాధ్యత యూనియన్ పై ఉందని వారు స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలపై ప్రధాన ప్రతిపక్ష పాత్రను సీఐటీయూ పోషిస్తుందని వారు స్పష్టం చేశారు. స్ట్రక్చరల్ సమావేశాలు గత గుర్తింపు సంఘం టిబిజీకేఎస్ హయాంలో నిర్వహించలేదని దీనిపై ఎందుకు ప్రశ్నించలేదని ప్రతిపక్షాలను విమర్శిస్తున్న ఏఐటీయూసీ నాయకులు గతంలో ప్రాతినిధ్య సంఘంగా గెలిచిన 2 ఏరియాల్లో స్ట్రక్చర్డ్ సమావేశాలు ఎందుకు నిర్వహించలేదో ఎఐటియుసి నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలనీ వారు హితవు పలికారు.

ఏరియాలో జరిగిన స్ట్రక్చర్ సమావేశాలలో చర్చించిన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించా లని, పెండింగ్ ప్రమోషన్లను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. గనులలో జరుగుతున్న ప్రమాదాల తీరుపై అధ్యయనం చేసి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్బంగా గని ఫిట్ సెక్రటరీ సంకె వెంకటేష్ ఆధ్వర్యంలో సూరజ్, నరేందర్ లతో పాటు యువ కార్మికులు యూనియన్ లో చేరగా వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆదర్శ్, విద్యసాగర్ గని కార్మికులు పాల్గొన్నారు.