calender_icon.png 23 October, 2024 | 3:54 AM

మహిళలకు రక్షణ లేకుండా పోయింది

27-08-2024 06:36:05 PM

సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్

లక్షేట్టిపేట్, (విజయ క్రాంతి): మహిళలకు రక్షణ లేకుండా పోయిందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ అన్నారు. మంగళవారం కోల్ కత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచారని ఖండిస్తూ లక్షేట్టిపేట్ మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనం, ఐకేపీ మండల సమైక్య కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన కార్మిక సంఘం,  ఐజేపి వివోఏ ఉద్యోగుల సంఘాల (సీఐటీయు) ఆధ్వర్యంలో ఫ్లాకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళల కొరకు ఎన్ని చట్టాలు వచ్చినా వాటిని అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయన్నారు. ఇలాంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళల రక్షణ కొరకు ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.