05-03-2025 12:00:00 AM
మహబూబ్ నగర్, మార్చి 4 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక ఉద్యోగ లేబర్ కోడు ల కు వ్యతిరేకంగా సమ్మెకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి అన్నారు. మంగళవారం సిఐటియు జిల్లా విస్తృతస్థాయి సమావేశం కామ్రేడ్ దీప్లా నాయక్ అధ్యక్షతన సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు సమ్మె ద్వారానే కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కార్మిక వర్గానికి ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి లేబర్ కోడు లను అమల్లోకి తేవాలని చెబుతున్నదని, ధరలు విపరీతంగా పెంచి కార్మిక వర్గం పై భారం వేస్తూ, బడ్జెట్లో కార్మిక వర్గానికి మొండిచేయి చూపించి. కనీస వేతనాల కోసం, పీఎఫ్ కోసం ఇతర కార్మిక వర్గ సమస్యల పరిష్కారానికి బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని, కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా సమ్మె ద్వారానే సమాధానం చెప్పాలన్నారు.
గ్రామపంచాయతీ కార్మికులకు ప్రమాదాల పారిన పట్టించుకోవడంలేదని వారిని పూర్తిచేయల ఆదుకునేది అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ర్ట నాయకులు కిల్లి గోపాల్, జిల్లా అధ్యక్షులు దిప్లా నాయక్, చంద్రకాంత్, వరదగాలన్న ,గోనెల రాములు, వేణుగోపాల్ ,వెంకటేష్ గౌడ్, పెంటయ్య శివరాములు, వెంకటయ్య, వెంకటేష్, రాజ్ కుమార్, రాములు హనుమంతు తదితరులు పాల్గొన్నారు