01-03-2025 10:39:56 PM
శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి నల్లగండ్ల(Nallagandla) లోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరాలను(Citizens Specialty Hospital Free Medical Camps) ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సికింద్రాబాద్ వాకర్ స్టోన్, జె సి ఏ ఇండియా రైస్ అప్ 2025 వారి ఆధ్వర్యంలో పాపిరెడ్డి నగర్ లోని జిహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడుతూ.. పేదరికం కారణంగా ఎవరూ వైద్యానికి దూరం కాకూడదనే సంకల్పంతో సిటిజన్స్ హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి తగిన సేవలు అందించాలని సూచించారు. సమాజ శ్రేయస్సులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవల కోసం తనవంతు తోడ్పాటు అందిస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గొయల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జెసీఐ ఇండియా, చతుర్వేది జోన్ ప్రెసిడెంట్ జెసీఐ ఇండియా జోన్ 12, వేణు గోపాల్ జోన్ వైస్ ప్రెసిడెంట్ రీజియన్ సీ జెసీఐ ఇండియా జోన్ 12, ఎచ్ జీ ఎఫ్ ప్రెసిడెంట్ సుమతి, ఎచ్ జీ ఎఫ్ సెక్రటరీ క్రాంతి, సీనియర్ నాయకులు బద్దం కొండల్ రెడ్డి, రాష్ట్ర యువజన నాయకులు రాగం అభిషేక్ యాదవ్, వార్డ్ మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, కుమారి, లక్ష్మి, జయ, అరుణశ్రీ, సాయి, రవి, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.