calender_icon.png 19 March, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ రాజకీయ పార్టీతో, సంస్థతో సంబంధం లేదు

11-03-2025 08:08:08 PM

కామారెడ్డి సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు న్యాయవాది జగన్నాథం

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో 40 సంవత్సరాల క్రితం 1985లో కొందరు ఉత్సాహవంతులైన, విద్యాధికులైన యువకులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, లాయర్లు కలిసి కామారెడ్డి సిటిజన్స్ అసోసియేషన్(Kamareddy Citizens Association) ఏర్పాటు చేయడం జరిగిందని, ఏ రాజకీయ పార్టీకి, సమస్తకు సంబంధం లేదని కామారెడ్డి సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్నాథం(Kamareddy Citizens Association President Advocate Jagannadham) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంస్థ ప్రధాన ఆశయం కామారెడ్డి ప్రాంత పేద, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చి, ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా పరిష్కారాలు చేయించడం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో కామారెడ్డి డిగ్రీ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే ఉద్యమం, కామారెడ్డి ఆఫీసర్స్ క్లబ్ ప్రభుత్వ స్థలంలో ఉన్నందున ఆ భవనాన్ని ప్రభుత్వం సాధీనం చేసుకోవాలనే ఉద్యమం, సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం జరిగిన ఉద్యమాలు, పార్లమెంటు-అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి వేదికలు ఏర్పాటు చేయడం, కామారెడ్డి ఆల్కహాల్ ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం జరిగిన ఉద్యమం, బీడీ కార్మికులు, వృత్తి కార్మికుల హక్కుల కోసం జరిగిన ఉద్యమాలు, లారీ డ్రైవర్స్ సమస్యల కోసం, వారి హక్కుల కోసం జరిగిన ఉద్యమాలలో సిటిజన్స్ అసోసియేషన్ చురుకుగా పాల్గొన్న విషయం కామారెడ్డి ప్రాంత ప్రజలకు తెలిసిన విషయమే నన్నారు.

 1990 సంవత్సరంలో కామారెడ్డి పట్టణానికి నీటి ఎద్దడి తీర్చడం కోసం బుర్ర మత్తడి నుండి వచ్చే పైప్ లైన్ గురించి కిష్టమ్మ గుడి వద్ద గల దర్గా వద్ద ఏర్పడ్డ రెండు వర్గాల మధ్య ఘర్షణ తలఎత్తినప్పుడు సిటిజన్స్ అసోసియేషన్ పూనుకొని సామరస్యంగా పరిష్కరించింద అన్నారు. కామారెడ్డి ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు  పెరుగుతున్న నేపథ్యంలో రైతు ఆత్మ హత్యల నిరోధక కమిటీ  ద్వారా చైతన్యం కల్పించి, సమస్యలకు పరిష్కారం జీవితాన్ని అంతం చేసుకోవడం కాదని, ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాలని తెలిపామన్నారు. తెలంగాణ మలిదశ పోరాటం ప్రారంభానికి ముందే సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను చాటడానికి ఉద్యమ రచనలు చేయడానికి 2004లో కామారెడ్డి లో సదస్సు నిర్వహించాము. ఈ సదస్సు ఇచ్చిన చైతన్యమే రాబోయే తెలంగాణ పోరాటానికి కర్టెన్ రైజర్ గా పనిచేసింది. మలిదశ తెలంగాణ ఉద్యమం పునాది వర్గాలలో విస్తరించడానికి కృషిచేసిన జేఏసీ కన్వీనర్ బాధ్యతను సిటిజన్స్ అసోసియేషన్  స్వీకరించి ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి కృషి చేసింది.

కామారెడ్డి సిటిజన్స్ అసోసియేషన్ కు ఏ రాజకీయ పార్టీతో సంస్థకు సంబంధం లేదని స్పష్టం చేయదలచుకున్నాం. కేవలం ప్రజల సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంస్థలు, సంఘాలతో కలిసి ఒక విశాలమైన ఉమ్మడి వేదిక నిర్మాణానికి కృషి చేసింది. ఈ సిటిజన్స్ అసోసియేషన్ సంస్థకు ఏ పార్టీ కూడా దగ్గర కాదన్నారు. ఇటీవల విడుదలైన "50 సంవత్సరాల విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్థానం"  అనే పుస్తకంలో ఒక వ్యాసం వచ్చింది. వ్యాస రచయిత పి విజయరామరాజు మా సిటిజన్స్ అసోసియేషన్ ను ప్రస్తావిస్తూ ఆర్ఎస్యు ,ఆర్ వై ఎల్ కమిటీల ప్రోద్బలంతో ఏర్పడిందని ఒక తప్పుడు వ్యాఖ్యానం చేశాడు. దీన్ని అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోంది. మా సంస్థకు ఎలాంటి రాజకీయ పార్టీలతో, సంస్థలతో సంబంధం గానీ, అనుబంధం గానీ లేదని ఉండదని స్పష్టంగా ప్రకటిస్తున్నాం. సిటిజన్స్ అసోసియేషన్ తన ప్రారంభం నుంచి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యలపై పనిచేస్తోంది. సమాజంలో ఉన్నతమైన, ఆత్మీయమైన మానవీయ విలువలు ఏర్పడడానికి కృషి చేస్తుందని కామారెడ్డి ప్రాంత ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు. కామారెడ్డి సిటిజన్స్ అసోసియేషన్ ఏ ఒక్క రాజకీయ పార్టీ కి కానీ ఏ ఒక్క సంస్థకు గాని ఇంతవరకు కొమ్ముకాయ లేదని గ్రహించాలని ఆయన కోరారు.