26-03-2025 08:54:00 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): సాంకేతిక రంగం(Technology Sector)లో దిగ్గజ దిగ్గజం అయిన సంస్థ సిస్కో(Cisco) నైపుణ్య శిక్షణ అందించడంలో తెలంగాణలోని ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(Young India Skills University)తో కలిసి పనిచేయనుంది. ఆ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సమక్షంలో స్కిల్స్ యూనివర్సిటీకి, సిస్కో సంస్థకు మధ్య బుధవారం అవగాహన ఒప్పందం కుదిరింది. అసెంబ్లీ కమిటీ హాలులో ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు(IT Minister Sridhar Babu), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు, సిస్కో సీనియర్ వైఎస్ ప్రసిడెంట్ డాక్టర్ గయ్ డీడ్రిక్, ఆ సంస్థ ఇతర ప్రతినిధులతో కీలక సమావేశం జరిగింది. నైపుణ్య శిక్షణ అందించే విషయంలో ఈ సందర్బంగా సిస్కోకు స్కిల్స్ యూనివర్సిటీకి, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ కు మధ్య వేర్వేరు ఒప్పందాలు కుదిరాయి. ఈ సమావేశంలో స్కిల్స్ యూనివర్సిటీ వైఎస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు, టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా పాల్గొన్నారు.