మంచిర్యాల, జనవరి 13 (విజయక్రాంతి): జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న గిరి ప్రదక్షిణకు సోమవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయోధ్య నుంచి తీసుకువచ్చిన శ్రీరాముడి పాదుకలతో సురేష్ ఆత్మారావు మహరాజ్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చొప్పకట్ల శ్రీకాంత్, గిరి ప్రదక్షిణ కమిటీ సమితి సభ్యులు రాజేశ్‌శర్మ, కర్ణకంటి రవీందర్, ప్యాగ లక్ష్మణ్, డేగ నగేశ్, రాజా రమేశ్, రాఘవేంద్ర స్వామి, సద్దనపు సంతోశ్, రమేశ్‌గౌడ్, ఛత్రపతి శివాజీ సేవా సమితి వ్యవస్థాపకుడు ఉదయ్‌కిరణ్ పాల్గొన్నారు.