calender_icon.png 25 October, 2024 | 5:48 AM

జీరో వ్యాపారంలో హీరోలు.. తెలంగాణ వ్యాపారుల విలవిల

12-09-2024 02:45:21 PM

చైనా వస్తువుల చలా"మణి"తో

తెలంగాణ వ్యాపారుల విలవిల

జగిత్యాల, (విజయక్రాంతి): వ్యాపార సామ్రాజ్య విస్తరణ లక్ష్యంగా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల పేరుతో ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్, శానిటేషన్, ప్లైవుడ్, సెల్ ఫోన్ తదితర జీరో దందాతో హీరోలుగా చలా"మణి"తో తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యాపారులు విలవిలలాడుతున్నారు. చైనా జీరో వ్యాపారం హీరోగా చలా"మణి" చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతున్నారు. విడిభాగాలు కొనుగోలు చేసిన వినియోగదారుల కు జీఎస్టీ బిల్లు దేవుడెరుగు కనీసం ఆదుకాణాల పేర బిల్లులు ఇవ్వడం లేదు. తీసుకున్న వస్తువులకు బిల్లు తెల్లకాగితాలపై వేసి ఇస్తున్నారు.

నాసిరకం వస్తువుల విక్రయాలు ఆగకుండా  కొనసాగుతున్నాయి. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి పట్టణాలకే పరిమితం కాక జిల్లా వ్యాప్తంగా పల్లెలకు చైనా  వస్తువులు విక్రయిస్తూ సీఎస్టీ, జీఎస్టీ చెల్లించకుండా పన్నులు ఎగ వేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించా ల్సిన పన్నులు ఎగ్గొడుతూ ఢిల్లీ, ముంబాయి ప్రాంతాల నుండి ప్రముఖ కంపెనీల పేరుతో నాసిరకం వస్తువులను దిగుమతి చేసుకొని అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. 

ఎలక్ట్రానిక్స్‌, హార్డ్ వేర్, శానిటైజర్, ఐరన్, ప్లైవుడ్, సెల్ ఫోన్ రంగాల్లో దశాబ్ద కాలం పాటు వ్యాపారాలు చేస్తున్న వారు ఆర్థికంగా ఎదగలేక పోతున్నారు. నాలుగైదేళ్ల కింద ఇక్కడ అడుగు పెట్టిన చైనా వస్తువుల వ్యాపారులు అడ్డగోలుగా లాభాలు అర్జించి అనేక ఆస్తులను కూడబెట్టుకుంటున్నారనే ఆరోపణ లున్నాయి. ఇదిలా ఉండగా కల్తీ వస్తువులు విక్రయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి దండిగా దందుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి.

పన్నులు ఎగవేస్తున్న చైనా వ్యాపారుల సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకాకుండా సొంత అదాయాల పెంపుపై దృష్టి సారిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత శాఖల అధికారులు చైనా వ్యాపారుల  పై నిఘా పెట్టి వారి మోసాలను అరికట్టి పభుత్వ ఆదాయానికి గండికొట్టి దండిగా సంపాదనపై దృష్టి సారిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు చెల్లిం చేలా చర్యలు చేపట్టడంతో పాటు పాలకులకు పన్నులు చెల్లిస్తున్న స్థానిక వ్యాపారులు దెబ్బతినకుండా పరిరక్షించా ల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు.