calender_icon.png 22 January, 2025 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిన్‌క్యూ కప్ విజేత అలీరెజా

30-08-2024 12:00:00 AM

ఐదో స్థానంలో గుకేశ్, ప్రజ్ఞా

సెయింట్ లూయిస్: సిన్‌క్యూ ఫీల్డ్  చెస్ టోర్నీ విజేతగా ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ అలీరెజా ఫిరౌజా నిలిచాడు. ఇక భారత గ్రాండ్ మాస్టర్లు ప్రజ్ఞానంద, గుకేశ్ ఐదో స్థానంతో టోర్నీని ముగించారు. చివరి రౌండ్ ను కూడా ఇద్దరు డ్రా ముగించి చెరో 4.5 పాయింట్లు సంపాదించారు. టోర్నీలో గుకేశ్, ప్రజ్ఞానందలు తాము ఆడిన తొమ్మిది గేములను డ్రా చేసుకోవడం గమనార్హం. అమెరికా గ్రాండ్‌మాస్టర్ కరూనా రెండో స్థానంలో నిలవగా, ఫ్రాన్స్‌కు చెందిన లాగ్రెవ్, ఉబ్జెకిస్థాన్‌కు చెందిన నోడిర్‌బర్క్ సంయుక్తంగా మూడో స్థానం దక్కించుకున్నారు.