calender_icon.png 24 November, 2024 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిభను ప్రోత్సహించేందుకు ‘సినిమాటికా ఎక్స్‌పో’

24-11-2024 03:21:25 AM

తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తాము రెండు దఫాలుగా ఏర్పాటుచేస్తున్న ‘సినిమాటికా ఎక్స్‌పో’ యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు దోహదపడుతోందని సినీ దర్శకుడు పీజీ విందా తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ‘సినిమాటికా ఎక్స్‌పో’ కార్యక్రమం మంచి స్పందనతో ముగిసింది. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆస్తికర విషయాలను పంచుకున్నారు. ‘తెలుగు సినిమా పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందుతోంది. కొన్ని కారణాల వల్ల సాంకేతికంగా వెనకబడిపోయాం. అందుకే ‘సినిమాటికా ఎక్స్‌పో’ను నిర్వహిస్తున్నాం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా త్వరలో మార్కెట్లోకి రాబోతున్న ఎక్విప్‌మెంట్ల గురించి ముందే తెలుస్తుంది. తాజాగా ‘ఎక్స్‌పో రెండో ఎడిషన్’ను 38 వేల మంది సందర్శించారు. ఇంత పెద్ద మొత్తంలో హాజరు కావడం ఆసియాలోనే రికార్డు. ‘సినిమాటికా ఎక్స్‌పో’ ద్వారా సాంకేతికతను పరిచయం చేయడమే కాకుండా, యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు సూచనలు చేస్తూ సెమినార్లు నిర్వహించాం. మూడో ఎడిషన్‌ను ఇంకా భారీగా నిర్వహించాలని భావిస్తున్నాం. పలు అంతర్జాతీయ సంస్థలు రావడానికి అంగీకారం తెలిపాయి. ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ మద్దతుతో ఈ ఎక్స్‌పోను మరో స్థాయికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాం.