calender_icon.png 22 April, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనిమాల యాక్టు జేశి ఎలిగిపోతవా..

22-04-2025 12:00:00 AM

కే సుధాకర్ రెడ్డి, అరుణ్ రాజ్, పూర్ణచంద్ర, మౌనికా బొమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘ముత్తయ్య’. ఈ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ మౌర్య రూపొందించారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ ఎల్‌ఎల్పి బ్యానర్లపై వంశీ కారుమంచి, వృందా ప్రసాద్ నిర్మించారు. త్వరలో ఈ సినిమా ఈటీవీ విన్ లో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘సీనిమాల యాక్ట్ జేశి..’ అనే పాటను స్టార్ హీరో విజయ్ దేవరకొండ సోమవారం విడుదల చేశారు.

సీనిమాల యాక్టు జేశి ఎలిగిపోతవా.. బుట్టలల్లుకుంట ఊళ్లె మిగిలిపోతవా ముత్తయ్యా.. తిక్క తిక్క ఈడియోలు జేసుకుంటవా.. స్టెప్పులేసి ఎగిరి దుంకి సంపుతుంటవా ముత్తయ్యా.. పేమసైతవా పేళ్లు గోళ్లు గిల్తవా.. దేశమంత లొల్లి జేస్తావా.. డ్యాన్సు జేస్తవా డయ్యిలాగు జెబుతవా ఓపికంత కూడ వెడ్తావా ముత్తయ్యా..’ అంటూ ముత్తయ్య వెండితెర కలను వర్ణిస్తూ సాగుతోందీ పాట. దర్శకుడు భాస్కర్ మౌర్య రాసిన గీత సాహిత్యానికి మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ స్వరాలు సమకూర్చగా, చిన్నా కే పాడారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దివాకర్ మణి; సంగీతం: కార్తీక్ రోడ్రిగ్స్; ఎడిటర్: సాయిమురళి; ఆర్ట్: బాలు.