calender_icon.png 1 April, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాళ్లకు ఇప్పటికీ చవకైన వినోదం సినిమానే!

26-03-2025 12:08:37 AM

వేణుగోపాల్, ‘8పీఎం’ సాయికుమార్, పార్థు, రఘుమారెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘సీతన్నపేట గేట్’.  వైఎంఆర్ క్రియేషన్స్, ఆర్‌ఎస్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. వై రాజ్‌కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా ఏప్రిల్ 4న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తున్న నేపథ్యంలో చిత్రబృందం మీడియాతో సమావేశమైంది.

కార్యక్రమానికి అతిథి గా విచ్చేసిన దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. “ఆర్‌ఎస్ ప్రొడక్షన్స్ ఎన్టీఆర్‌తో ‘సుబ్బు’, నా దర్శకత్వంలో మహానంది మూవీ చేశారు. ఆ సంస్థ నుంచి ‘సీతన్నపేట గేట్’ ఇప్పుడున్న ట్రెండ్‌కు సరిపోయేలా మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో వస్తోంది” అన్నారు. హీరో వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘ఇది నాకు తొలి సినిమా.

దీంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతానని ఆశిస్తున్నా’ అన్నారు. చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించిందే మా ఈ సినిమా” అని తెలిపారు. నిర్మాత ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు థియేటర్లకు పెద్దగా ప్రేక్షకులు రావడం లేదు అంటున్నారు.

కానీ సగటు మధ్యతరగతి, పేదవారికి ఇప్పటికీ చవకైన వినోదం సినిమానే. కంటెంట్ లేని సినిమా వంద కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించినా ప్రేక్షకులకు నచ్చదు. కథ బాగుంటే చిన్న సినిమాలు కూడా ఆదరణ పొందుతాయి. ‘సీతన్నపేట గేట్’ మంచి కంటెంట్ ఉన్న సినిమా” అని చెప్పారు.