సహకరించాలి: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయ క్రాంతి): రాష్ట్రంలో బడుగు, బలహీన, మైనార్టీ, దళిత విద్యార్థుల కోసం ప్రపంచ స్థా యి నాణ్యతతో కూడిన రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నా మని, ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమల కూడా పాలుపంచుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు.
ఒక్కో పాఠశాలకు రూ. 25 కోట్ల వరకు వెచ్చిస్తూ 119 నియోజకవర్గాల్లో రూ. 200 కోట్లతో ఈ పాఠశాలల నిర్మాణం జరుగుతుందని, దీనికోసం సినీ పరిశ్రమల నుంచి కొంత సెస్ రూపంలో ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలని అనుకుంటున్నామని పేర్కొన్నారు. ఇది ఒక నోబుల్ కాజ్ అని, ఇందుకు సినీ పరిశ్రమ సహకరించాలని కోరారు.
గురువారం సినీ పరిశ్రమ ముఖ్యుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. సినీ అభిమానుల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందినవారు ఉన్నారని, వారి భవిష్యతే తెలంగాణ భవిష్యత్‌గా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నారు. డ్రగ్స్‌పై ప్రభుత్వం యుద్ధం ప్రకటించి, ప్రత్యేకంగా నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు.
సినీ నటుల ప్రచారం ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని, రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు సామాజిక బాధ్యతలో భాగంగా సినీ పరిశ్రమ పెద్దఎత్తున పాల్గొని ప్రచారం నిర్వహించాలని కోరారు. దీంతోపాటు సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో సినీ నటులు వారి గొంతు వినిపించాలని, పాల్గొనాలని సూచించారు.
సినీ పరిశ్రమకు ఏదైనా మేలు జరిగిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలోనే అని స్పష్టం చేశారు. ఆ వారసత్వాన్ని మా ప్రభుత్వం కొనసాగింస్తుందని పేర్కొన్నారు. సినీ పరిశ్రమను ప్రపంచస్థాయిలో పోటీపడే విధంగా ఎకో సిస్టమ్‌ను సపోర్టు చేస్తామని తెలిపారు.
రైజింగ్ తెలంగాణ నినాదంతో ముందుకు వెళ్తున్నామని, తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి చెందాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.