calender_icon.png 20 September, 2024 | 11:08 AM

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు సీఐఐ అవార్డులు

20-09-2024 12:00:00 AM

రాజేంద్రనగర్, సెప్టెంబర్19: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి(ఆర్‌జీఐఏ) సీఐఐ (కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ 2024) జాతీయ అవార్డులు వచ్చాయి. ‘నేషనల్ ఎనర్జీ లీడర్’, ‘ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ యూనిట్’ అవార్డులు వచ్చినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు గురువారం వెల్లడించాయి. ఎయిర్‌పోర్ట్‌కు వరుసగా ఆరో ఏడాది నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు, వరుసగా ఎనిమిదో ఏడాది ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ యూనిట్ అవా ర్డు రావడం విశేషం. సీఐఐ 2024 నిర్వహించిన ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్ మెంట్ 25వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో సంబంధిత అధికారులు ఈ అవార్డులను అందుకున్నారు.

ఇది ఇంధన సామర్థ్యం, విమానయానంలో సుస్థిరత పట్ల నిబద్ధతను తెలియ జేస్తుందని పేర్కొన్నారు. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నే షనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ ద్వారా నిర్వహించడుతున్న ఆర్‌జీఐఏ దాని సుస్థిర పద్ధతులు, కార్బన్ పాదముద్రను తగ్గించే ప్రయత్నాలకు గుర్తింపు పొందింది. సుమారు 1.82 మిలియన్ యూనిట్ల గణనీయమైన శక్తి ఆదాను సాధించింది. ఇది ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ నుంచి లెవల్4+ న్యూట్రిలిటీ అక్రిడిటేషన్ కలిగి ఉన్న కార్బన్ న్యూట్రల్ ఎయిర్‌పోర్టు కూడా అని ఎయిర్‌పోర్టు సీఈవో ప్రదీప్ పాణికర్ పేర్కొన్నారు.