calender_icon.png 16 November, 2024 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోమేశ్ మెడకు సీఐడీ ఉచ్చు

15-09-2024 05:46:51 AM

  1. ఇప్పటికే 1400 కోట్ల స్కాంలో కేసు నమోదు
  2. కేసును రీరిజిస్టర్ చేసిన సీఐడీ

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సీఐడీ ఉచ్చు బిగుస్తోంది. బీఆర్‌ఎస్ హయాంలో వాణిజ్య పన్నుల శాఖలో భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. వస్తువులు సరఫరా చేయక పోయిన చేసినట్టు బోగస్ ఇన్వాయిసులు సృష్టించి భారీగా నిధులు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. రూ.1400 కోట్ల స్కాం జరిగినట్టు విచారణలో  సీఐడీ అధికారులు గుర్తించారు. అంతేకాదు వస్తువులు సరఫరా చేయకపోయిన చేసినట్టు బోగస్ ఇన్వాయిసులు సృష్టించి భారీగా నిధులు కాజేశారని ఆరోపించారు.

ఈ క్రమంలో తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఐడీ అధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌తోపాటు మరో నలుగురు అధికారులకు సీఐడీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నమోదైన కేసును సీఐడీ అధికారులు రీరిజిస్టర్ చేశారు. త్వరలోనే సోమేశ్‌కుమార్‌తోపాటు నిందితులుగా ఉన్న ఇతర అధికారుల ను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్న ట్టు తెలుస్తోంది. 

ఏ సోమేశ్‌కుమార్..

తెలంగాణలో వాణిజ్య పన్నుల కుంభకోణం వ్యవహారంపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఏ గా తెలంగాణ వాణిజ్య పన్ను ల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఏ ఉప కమిషనర్ ఏ.శివ రాం ప్రసాద్, ఏ హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్‌బాబు, ఏ ప్లియంటో టెక్నా లజీస్ కంపెనీలున్నట్టు సమాచారం. అయితే మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఏ నమోదు చేశారు. దీంతోపాటు త్వరలోనే ఈ ఐదుగురు స్టేట్మెంట్లను రికార్డు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే 70 కంపెనీల్లో ఐజీఎస్టీ చెల్లింపుల్లో భారీగా అవకతవకలకు పాల్పడడమే కాకుండా... ఐజీ ఎస్టీ కింద రూ.1000 కోట్ల మేర అక్రమంగా ఇన్‌పుట్ బదిలీ చేసినట్టు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ విచారణలో తేలింది.

ఎలా జరిగిందంటే...

జీఎస్టీలో పన్ను ఎగవేతలు, బకాయిలు వంటి వాటిని గుర్తించడానికి వాణిజ్య పన్నుల కమిషనరేట్ ఒక ప్రైవేట్ సంస్థ తో సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయించింది. అయితే ఈ సాఫ్ట్‌వేర్‌లో కీలకమైన మాడ్యూల్ లేకపోవడంలో పోలీసులు కేసు నమోదు చేసిన ఇద్దరు అధికారుల ప్రమేయం ఉన్నట్టు వాణి జ్య పన్నుల కమిషనరేట్ అప్పట్లోనే గుర్తించింది. సాధారణంగా డీలర్లు తాము అమ్మిన వస్తువులకు ‘జీఎస్టీర్1’ రిటర్నులు, ఆ తర్వాత అమ్మకాలు, కొనుగోళ్లు, చెల్లించాల్సిన పన్నుకు సంబంధించి ‘జీఎస్టీఆర్ రిటర్నులను ఫైల్ చేయాలి. వస్తువులను కొన్న ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు జీఎస్టీఆర్ తోపాటు ‘జీఎస్టీఆర్ రిటర్నులను సమర్పించాలి. 

కానీ... ఇక్కడి డీలర్లు వస్తువులను ఇతర రాష్ట్రాల డీలర్లకు అమ్మినట్లు జీఎస్టీఆర్ రిటర్నులను మాత్రమే ఫైల్ చేశారు. వీటి ఆధారంగా ఇతర రాష్ట్రాల్లోని డీలర్లు వస్తువులను కొనుగోలు చేసినట్టు జీఎస్టీఆర్ 2తోపాటు జీఎస్టీఆర్ ఫైల్ చేశా రు. దాంతో వారికి ఐటీసీని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఏర్పడింది. పెద్ద మొత్తంలో ఐటీసీని క్లెయిమ్ చేశారు. ఇలా రిటర్నులను ఫైల్ చేసినట్లు చూపారు కానీ.. భౌతికంగా వస్తు సరఫరా జరగలేదు.

ఇక్కడీ డీలర్లు జీఎస్టీఆర్ ని సమర్పిస్తే ప్రభుత్వానికి జీఎ స్టీని చెల్లించాల్సి ఉండేది. అసలు వస్తు రవాణా జరగనప్పుడు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ... ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని క్లెయిమ్ చేయడానికే వస్తు సరఫరా జరిగినట్టు దొంగ ఇన్వాయిస్‌లను సృష్టిం చారు. అయితే రెండు రాష్ట్రాల మధ్య జరిగే లావాదేవీల ఐజీఎస్టీ సంబంధిత జీఎస్టీఆర్ ని సమర్పించారా? లేదా? అన్నది గుర్తించే మాడ్యూల్ కమిషనరేట్ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో లేనట్టు తేలింది. 

రాష్ట్ర వస్తు సేవల పన్ను, కేంద్ర వస్తు సేవల పన్నుల రిటర్నులను గుర్తించే మాడ్యుల్స్‌ను మాత్రమే సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చారు. ఐజీఎస్టీకి సంబంధించిన మాడ్యుల్‌ను పొందుపర్చకపోవడంతో ఇక్కడి డీలర్లు పన్ను సంబంధిత రిటర్నులను దాఖలు చేశారా? లేదా? అన్నదాన్ని సాఫ్ట్‌వేర్ గుర్తించడం లేదు. దీంతో దొంగ ఇన్వాయిసులతో ఐటీసీని కొల్లగొట్టినట్టు తేలింది. 

అసలు స్కాం...

సాధారణంగా ఒక రాష్ట్రంలోని డీల ర్లు, మరో రాష్ట్రంలోని డీలర్లకు విక్రయిం చే వస్తువులపై ఐజీఎస్టీని కేంద్ర ప్రభు త్వం వసూలు చేస్తుంది. దీనిని కేంద్రం, వస్తువులు కొన్న రాష్ట్రానికి చెరో 50 శా తం పంపిణీ అవుతుంది. అయితే రాష్ట్రంలోని కొంతమంది డీలర్లు దీన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఇక్కడి డీలర్లు ఇతర రాష్ట్రాల వారికి వస్తువులను విక్రయించినట్టుగా నకిలీ ట్యాక్స్ ఇన్వాయి సులను సృష్టించారు. ప్రధానంగా 18 శాతం ట్యాక్స్ ఉన్న ఇనుము, ఇత్తడి, రాగి స్క్రాప్‌ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్టు ఆ ఇన్వాయిసుల్లో పేర్కొన్నారు. నిజానికి ఈ వస్తు రవాణా భౌతికంగా జరగదు.  

బీఆర్‌ఎస్ ప్రమేయం ఉందా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేశ్‌కుమార్ మాజీ సీఎం కేసీఆర్‌కు సన్నిహితంగా మెదిలారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కీలకంగానూ వ్యవహరించారు. అయితే తెలంగాణ సర్కారులో సుదీర్ఘకాలం పని చేసిన సోమేశ్‌కుమార్ పదవీ విరమణ కు ముందు ఏపీ క్యాడర్‌కు బదిలీ చేస్తూ హైకోర్టు ఆదేశించింది. దానుకనుగుణంగా ఏపీలో రిపోర్టు కూడా చేశారు.

కానీ కొద్ది రోజుల్లోనే స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. పదవీ విరమణ తీసుకున్నప్పటికీ అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ తనతో ఉన్న సాన్నిహిత్యం మేరకు తిరిగి ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. జీఎస్టీ స్కాము లో సోమేశ్‌కుమార్ కూడా నిందితునిగా ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో మాజీ కేసీఆర్, బీఆర్‌ఎస్ పాత్ర ఏమైనా ఉందా అనే అనుమానాలు  వ్యక్తమవు తున్నాయి.