22-02-2025 06:14:44 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Graduate MLC Elections) భాగంగా శనివారం బెల్లంపల్లి నియోజకవర్గం(Bellampalli Constituency)లోని నెన్నెల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్(Polling Booth)ను బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలుద్దీన్(Bellampalli Rural CI Syed Afzaluddin) సందర్శించారు. ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని స్థానిక ఎస్సై ప్రసాద్ కు సూచించారు. విద్యార్థులకు వండి పెడుతున్న మధ్యాహ్న భోజనం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి విద్యార్థులు త్వరలో జరిగే పరీక్షలను ఎలాంటి ఒత్తిడి లేకుండా రాసి మంచి మార్కులు పొందాలని సూచించారు.