06-03-2025 01:23:42 AM
కూసుమంచి , మార్చి 5 (విజయ క్రాంతి): కూసుమంచి మండల కేంద్రం లోని గ్రంథాలయంకు వచ్చి పోటీపరీక్షలకు సన్నదమౌతున్న విద్యార్థులకు బాసటగా నిలిచారు హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్, కోటి పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సోమవరపు శ్రీనివాసాచారి .
కూసుమంచి గ్రామంలోనే బాల్యం నుండి డిగ్రీ వరకు చదువుకున్న అయన ప్రస్తుతం పోలీసు డిపార్ట్మెంట్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా సుల్తాన్ బజార్ కోటి పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఇక్కడ గ్రందాలయంలో పలు పోటీ పరీక్షలకు సన్నదమవుతున్న యువతకు గతంలో మేము సైతం అనే సామాజిక మాధ్యమ గ్రూపు నుండి పలు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న యువత ముందుకు వచ్చి సుమారు లక్ష రూపాయల విలువగల పోటీ పరీక్షలకు చెందిన పుస్తకాలు, స్టడీచైర్లు ఇప్పించారు.
ప్రస్తుతం స్టడీ చైర్లు కొన్ని శిదిలావస్తకు చేరడం, సరిపోను లేకపోవడంతో సామజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సిఐ శ్రీనివాసా చారి తక్షణమే స్పందించి సుమారు 25,000 రూపాయల విలువగల స్టడీచైర్లు,ప్యాడ్ లు లైబ్రరీయన్ లలిత సమక్షంలో అందజేశారు.
అంతేగాక మరో మూడు రోజుల్లో పోటీ పరీక్షలకు చదువుకుంటున్న విద్యార్థుల సౌకర్యార్ధం వాటర్ కూలర్ ను కూడా ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు .దీనితో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత, గ్రామస్థులు, పలువురు అభినందనలు తెలిపారు.
ఈ సందర్బంగా సిఐ శ్రీనివాసాచారి మాట్లాడుతూ.. ఇదే గ్రంథాలయంలో ,స్థానిక ఉన్నత పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసి ఆసక్తి ఉన్న విద్యార్థులకు సదుపాయాలు మేము సైతం కూసుమంచి యువత తరపున అందించటం సంతోషంగా ఉంది అని చదివే అభిరుచి కష్టపడే మనస్తత్వం ఉన్న విద్యార్థులకు చేయూత ఇవ్వటం బాధ్యత అని తెలిపారు.