29-04-2025 06:29:08 PM
చర్ల (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పోలీస్ శాఖ ఏజెన్సీలోని గ్రామీణ ఆదివాసీలకు ఎప్పుడు అండగా నిలుస్తుందని చర్ల సిఐ రాజు వర్మ(Charla CI Raju Varma) అన్నారు. మంగళవారం దుమ్ముగూడెం మండలం పత్తిపాక గ్రామానికి చెందిన అపక మారయ్య కుమారుడు అపక సతీష్ క్రీడా నైపుణ్యం కలిగిన వ్యక్తిగా పలు పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకున్న విషయం తెలిసిందే, ఐతే ఉన్నత చదువు చదివేందుకు ఆర్థిక స్తోమత లేక చర్ల మండల సిఐ రాజు వర్మని సంప్రదించగా పై చదువుల నిమిత్తం రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థిక సహాయం చేసిన సిఐ రాజు వర్మను పలువురు మండల ప్రజలు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నర్సిరెడ్డి, పత్తిపాక యువకులు పాల్గొన్నారు.