calender_icon.png 15 January, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విచ్చలవిడిగా వెలసిన బెల్ట్ షాపులతో శాంతి భద్రతలకు విఘాతం

08-08-2024 09:37:35 PM

మంథనిలో బెల్ట్ షాపుల నిర్వహకులకు కౌన్సెలింగ్ లో సీఐ రాజు

పెద్దపల్లి: మంథని మండలంలోని వివిధ గ్రామాల బెల్ట్ షాపుల నిర్వాహకులతో మంథని సీఐ రాజు ఎస్ఐ వెంకటకృష్ణతో కలిసి పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గ్రామాలలో కిరాణా షాపులు నిర్వహిస్తూ,  కిరాణా షాపు ముసుగులో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని, మా దృష్టికి వచ్చిందని అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విచ్చలవిడిగా బెల్టు షాపులు నిర్వహించడం వలన గ్రామాలలోని యువత మద్యానికి, చెడు వ్యసనాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని సీఐ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నటువంటి బెల్టు షాపులను వెంటనే మూసివేయాలని, లేకపోతే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విగాథం కలిగించే వారిని ఎవరినైనా వదిలిపెట్టేది లేదని, వారి పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.