calender_icon.png 8 April, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ప్రారంభించిన సీఐ జగడం నరేష్

07-04-2025 10:47:18 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద కమ్యూనిటీ మెడిటేషన్ సెంటర్ ను సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ జగడం నరేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి, కోర్టు బయటే రాజి మార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి ఈ కమ్యూనిటీ మేడియేషన్ సెంటర్ సభ్యులు సహకరిస్తారన్నారు. ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మండలానికి నలుగురు కమ్యూనిటీ మీడియేషన్ వాలంటరీగా వాజిద్ హుస్సేన్, జి శైలేష్, ఎండి రిజ్వాన్, హుండే బస్వరాజ్ లను నియమించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వేణుగోపాల్ బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి, అడ్వకేట్ మల్లేశ్వర్, విట్టల్ రావు అడ్వకేట్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్ గ్రామస్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.