29-03-2025 07:49:45 PM
పటాన్ చెరు: జిన్నారం మండలం సోలక్ పల్లిలో గ్రామంలో అతినారం లక్ష్మమ్మ నారాయణ గౌడ్ జ్ఞాపకార్థం అతినారం అంజమ్మ లక్ష్మా గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని జిన్నారం సీఐ నయీముద్దీన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ... చాలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన అతినారం కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. వేసవికాలంలో ప్రజల దాహార్తి తీర్చడానికి చలివేంద్రం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ రావుల కోరి, పరమేశ్వర్ రెడ్డి, వర్నాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాములు, జగన్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, రమేష్ గౌడ్, పెంటేష్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు నరేష్ గౌడ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.