22-02-2025 09:43:05 PM
కోదాడ,(విజయక్రాంతి): చుక్కా లక్ష్మీభాయ్ సైన్స్ టాలెంట్ టెస్ట్(Chukka Lakshmibai Science Talent Test)లో రాష్ట్ర ర్యాంకులను జయ పాఠశాల విద్యార్థులు సాధించి సత్తా చాటారని కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ అన్నారు. శనివారం పట్టణంలోని జయ పాఠశాలలో విద్యార్థులను అభినందిస్తూ మాట్లాడారు. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య సతీమణి, చుక్కా లక్ష్మీబాయమ్మ, జ్ఞాపకార్థం నిర్వహించిన చుక్కా లక్ష్మీబాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో జయ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అన్ని తరగతులలో 1.4,6 ర్యాంకులతోపాటు 50 లోపు 20 ర్యాంకులు, 100 లోపు 45 ర్యాంకులు సాధించారు.5వ తరగతి నుండి స్టేట్ 1వ ర్యాంక్ పి కీర్తి,6వ తరగతి నుండి స్టేట్ 6వ ర్యాంక్ ఎస్కి జాహిద్,9వ తరగతి నుండి స్టేట్ 4వ ర్యాంక్ పి వికాస్,10వ తరగతి నుండి స్టేట్ 6వ ర్యాంక్ సిహెచ్ అక్షయ్ సాధించారు.ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను, సహకరించిన అధ్యాపకులను, ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి, ప్రధానోపాధ్యాయులు చిలువేరు వేణు లు అభినందించారు.