calender_icon.png 15 January, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘క్రోనోవర్కింగ్’ ట్రెండ్.. ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్క్..

05-09-2024 11:15:40 AM

ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫీస్ పనిలో   లాగిన్ అయ్యి ... మీ ఇష్టా రీతిన లాగౌట్ కావాలని కోరుకుంటున్నారా ? .. మీ లాంటి మన: స్థితి ఉన్న వారి కోసం ఆఫీసు పరి స్థితులను, పని వేళలను తీర్చి దిద్ది.. మీ జీవ గడియారానికి అనుగుణంగా సర్కాడియన్ రిథమ్ కి కార్యాలయం తాలూకు 24 గంటలను.. మీ దేహ.. కాల రీతులకనుగుణంగా.. మీ ఇచ్చ మీరే.. వర్క్ అండ్ లైఫ్ .. సింక్రొనైజ్ చేసుకునే వెసులు బాటు ఉంది. ఈ ట్రెండ్ ఇపుడు ప్రపంచ వ్యప్తంగా వైరల్ అవుతున్న ‘క్రోనోవర్కింగ్’ ట్రెండ్.. 

మామూలు గా ఆఫీసు పని వేళలు 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. కానీ కరోనా తర్వాత, తమకు నచ్చిన సమయాల్లో పనిచేసుకోగలిగే   ట్రెండ్  పెరుగుతోంది. అందుకే   తమకు నచ్చిన సమయాల్లో లేదా వారి షెడ్యూల్‌కు అనుగుణంగా  చాలా మంది పనిచేయాలనుకుంటున్నారు. ‘క్రోనోవర్కింగ్’  విధానాన్ని  జర్నలిస్ట్ ఎలెన్  స్కాట్ కనుగొన్నారు.

పనిలో మరింత  ప్రాడక్టివిటీ కోసం పని గంటలను తమకు నచ్చిన విధంగా మార్చాలని కొంత మంది  కంపెనీలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీన్నే ఇప్పుడు ‘క్రోనోవర్కింగ్’ అని పిలుస్తున్నారు.

స్థిరమైన పని వేళల్లో పనిచేయడానికి బదులు వారి క్రోనోటైప్‌కు అనుకూలంగా ఉద్యోగులు పని గంటలను ఎంపిక చేసుకోవడాన్నే ‘క్రోనోవర్కింగ్’ అంటారు. క్రోనోటైప్ అంటే ఒక వ్యక్తి శరీరం సాధారణంగా నిద్రను కోరుకునే సమయం. సర్కాడియమ్ రిథమ్ గా పిలిచే ఈ సైకిల్ 24 గంటలలో ప్రతి మనిషి మానసిక శారీరక వైఖరులను ప్రభావితం చేస్తాయి. ఈ సమయాలు ఒక్కొక్కరికి మారిపోతూంటాయని చెబుతున్నారు. నాలుగు రకాల క్రోనోటైప్‌లు ఉంటాయని అమెరికా సైకియాట్రిస్ట్  మైఖేల్ బ్రూస్ చెప్పారు. 55 శాతం మంది ఉద్యోగులు రోజు మధ్యలో అంటే పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎక్కువ ఉత్పాదకతను అందించగలమని భావిస్తున్నారు.

కాగా 15 శాతం మంది ఉద్యోగులు తెల్లవారుజాముల్లో, మరో 15 శాతం మంది రాత్రివేళ్లల్లో పనిచేసేందుకు ఇష్టపడుతున్నారు. 10 శాతం ఉద్యోగులు రోజులో ఎప్పుడైనా పనిచేయగలుగుతామని అంటున్నారు.