హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (విజయక్రాంతి): టీఎన్జీవోస్ కేంద్ర సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సేనీ (ముజీబ్) ఆదేశాల మేరకు సోమవారం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎస్ విక్రమ్‌కుమార్ ఆధ్వర్యంలో గృహకల్ప కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.
కేంద్ర సంఘ మాజీ సభ్యులు బీ రెచల్ గారి సువార్త సందేశంతో కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో కేక్ కటింగ్ తరువాత డాన్ బాస్కో నవజీవన్ అనాథ శరణాలయ చిన్నారులకి(దాదాపు 50 మంది) డాక్టర్ ముజీబ్ దంపతుల తరఫున కొత్త వస్త్రాలు, సరుకులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో కేంద్ర సంఘ అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సేని (ముజీబ్), ఉపాధ్యక్షులు కస్తూరి వెంకట్, మహిళా సభ్యులు శ్రీమతి ఉమ, గీత, శైలజ, సంగారెడ్డి అధ్యక్షులు ముహమ్మద్ జావీద్ అలీ, సీమ ముజీబ్, జిల్లా సభ్యులు ఉమర్ ఖాన్, కుర్రాడి శ్రీనివాస్, వైదిక్ శాస్త్ర, శ్రీధర్ నాయుడు, గీత సింగ్, సుజాత, ముఖీమ్ ఖురేషి, మాజీ సభ్యులు ప్రభాకర్, దేవేందర్, శ్రీమతి జానకి, లైబ్రరీ రాణి, తుమకుంట రాజు, ముహమ్మద్ వహీద్, ముస్తఫా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.