కరీంనగర్ సిటీ, డిసెంబర్ 25: ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని సిద్ధార్థ విద్యా సంస్థల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపు కున్నారు. మంగళవారం విద్యానగర్‌లోని కిడ్స్‌వేర్‌లో జరిగిన వేడుకలను విద్యాసంస్థ ల ఛైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి కేక్ కట్ చేసి సంబరాలను ప్రారంభించారు. ఈ సంద ర్బంగా చిన్నారులు శాంటా క్లాజ్, జిసస్ వేషధారణ, ఆటపాటలతో అలరించారు. అనంతరం శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ చిన్నా రులు కులమతాలకు అతీతంగా పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
చిన్నారులు యోధులుగా, రాజులుగా, దేవదూతలుగా వేష ధారణతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడా న్ని భిన్నత్వంలో ఏకత్వంలాంటి దన్నారు. అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, భగవం తుడు ఒక్కడేనని చెప్పారు. అనంతరం విద్యా ర్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో ఉపాద్యాయులు, తల్లిదండ్రు లు పాల్గొన్నారు..