calender_icon.png 26 December, 2024 | 10:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో క్రిస్మస్ వేడుకలు

25-12-2024 10:51:58 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ సందర్బంగా చర్చిలన్ని విద్యుత్ అలంకరణతో ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకున్నారు. కామారెడ్డి పట్టణంలోని సీఎస్‌ఐ చర్చ్, రామారెడ్డి రోడ్డులోని ఫిలడెల్పియా చర్చ్, కల్వరి మందిరం, హోసన్నా మందిరం, హోసన్నా సన్నిధి చర్చ్‌లలో మహిళలు పురుషులతో పాటు పిల్లలు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్లు, పాదర్స్ పాటలతో సందేశాలతో చర్చిలన్ని కిక్కిరిసిపోయాయి. అన్ని చర్చిలలో భారీ సంఖ్యలో మహిళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.సి.ఎస్‌ఐ చర్చిలో జోసఫ్ కిషోర్, సెక్రటరీ ఎ. ఆమోస్, ఎ. దయాకర్, ఎ. ఆనంద్, ఏసురత్నం, కల్వరీ మందిరంలో సామ్యూల్ పాస్టర్, పాస్టర్  సైమన్ టి డానియల్ యిర్మీయా, ఇజ్రాయల్, విజ్రా,ఫిలాదేల్పియా, చర్చిలో పాస్టర్, జాషువా, హోసాన్నా మందరంలో  శ్రీనివాస్, పాల్, తో పాటు  తదితరులు పాల్గొన్నారు.